
వీటన్నిటి పైన తాజాగా జగన్ బాబాయి వైసీపీ రాజ్యసభుడు అయిన వైవి సుబ్బారెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. జగన్ ఎవరికో భయపడి సభలకు వెళుతున్నారనే విధంగా పలు రకాల కథలు వినిపిస్తున్నాయి ..అందులో ఎలాంటి నిజము లేదు జగన్ బ్లడ్ లోనే భయం లేదని ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటికి వచ్చి మరి సొంత పార్టీతో సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అయినా కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా చేస్తున్నారని తెలిపారు.
ఈ విషయం పైన ఇప్పటికే గుంటూరులో జగన్ పర్యటించి అక్కడ రైతులను కూడా పరామర్శించారని ఇక సూపర్ సిక్స్ హామీలు కేవలం ప్రకటనకే పరిమితమయ్యాయని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. వీటన్నిటినీ కూడా సభలో ప్రశ్నించేందుకు జగన్ సిద్ధంగానే ఉన్నారని అందుకే సభకు వెళ్లి ఉంటారు అన్నట్లుగా తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభకు వెళ్తారు అన్న విషయం మాత్రం తెలియదని అది మీరే చూస్తారు అంటూ తెలియజేశారు. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సి ఉన్నదని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. కేవలం కుట్రపూరితంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదని ప్రజలను మభ్య పెట్టేలా చూస్తున్నారని తెలిపారు.