
ఉభయ సభల సమావేశం కావడం తో బొత్స , జగన్ పక్క పక్కనే కూర్చున్నారు .. శాసన మండల్లో బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఉంది .. జగన్ కు అది కూడా లేదు .. అందుకే బొత్స మిగతా ఎమ్మెల్యేల తో పాటు ముందుకు వెళ్లి నినాదాలు చేయలేదు .. అయితే మిగిలిన ఎమ్మెల్యేల తో పాటు బయటకు వెళ్లిపోయారు జగన్ రెడ్డి .. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తాము వాకౌట్ చేస్తున్నట్టు గా ఎమ్మెల్యేలు చెప్పకు వచ్చారు .
ఇక వైసిపి వ్యవహారం చూసి అక్కడున్న వారే కాకుండా బయట ఉన్న జనం కూడా ముక్కున వేలేసుకొనే పరిస్థితి వచ్చింది .. ఏదైనా ప్రజల సమస్య కోసం ఇలా చేస్తే కాస్త వారికి గౌరవమైన ఉండేది కానీ లేని .. ప్రజలు ఇవ్వని గౌరవం కోసం జగన్ ఇలా తన తోటి ఎమ్మెల్యేలను ఉపయోగించుకోవడం ఆశ్చర్యంగా మారింది .. కేవలం అనహ్రత వేటు భయం తోనే అందరూ అసెంబ్లీకి వచ్చారని .. మరో 60 రోజులు అసెంబ్లీ పని దినాల వరకు కనిపించారని టిడిపి నేతలు కూడా వైసిపి పై పంచులు వేస్తున్నారు .