
అయితే అసెంబ్లీకి వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలకు .. కూటమి ప్రభుత్వం అదిరిపోయే షాక్ ఇచ్చింది .. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి .. వారికి 11వ బ్లాక్ కేటాయించి .. అక్కడి నుంచి రాగింగ్ మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో.. జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యే లాగా అసెంబ్లీకి వచ్చారు .. శాసనమండలి లో వైసీపీ తరుపున ప్రతిపక్ష నేతగా ఉన్నారు బోత్స .. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో రెండు సభలను కలిపి ఉంచడంతో.. బొత్స పక్కన జగన్ కూర్చున్నారు .అయితే ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అది ప్రజల చేత ఇవ్వబడాలి.. అంతేగాని ఎవరికి నచ్చినట్టు వారికి వారి పార్టీలకు హోదాలు ఇవ్వడం అనేది మన ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం .. వైసీపీకి ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా జగన్ కు దక్కని ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు కోసం ప్రభుత్వంతో పోరాడితే ఎలాంటి ఫలితం ఉండదు ..
ఇది ప్రజా తీర్పుని అవమానించినట్టు కాదా ? అయినా కూడా తమ ఆవేదనలో బలముంది తమ వాదనలో నిజాయితీ ఉందని వైసిపి నమ్మినట్లయితే సభలో పాల్గొని తమ అభిప్రాయాన్ని డిమాండ్ మాదిరి కాకుండా అభ్యర్థన రూపంలో అడిగి తేల్చుకోవాలి .. అంతేకానీ ఇలా గౌరవ రాష్ట్ర గవర్నర్ప్రసంగిస్తుంటే అరుపులు కేకలతో సభ నుంచి బయటకు వెళ్ళటం ఎంతవరకు సమంజసం ? గత ఐదేళ్లు వైసిపి ప్రభుత్వం సభలో ఆచరించిన సంప్రదాయాలు ఇవేనా ? గతంలో ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని గౌరవం ప్రతిపక్ష నేతలకు ధక్కని మర్యాదలు ఇప్పుడు వైసీపీకి జగన్ కు కావాలంటే వైసిపి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు .. ఇదే క్రమంలో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు గవర్నర్.. అయితే వైసిపి వాదన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు .. ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదు అంటూ పవన్ తేల్చి చెప్పారు .. అలాగే ఓట్లు శాతంతో ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ ను జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు .. హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం లేకపోతే ప్రసంగాలు అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని జగన్ పై వైసీపీ పై మండిపడ్డారు పవన్.