ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజున ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గవర్నర్ ఉభయ సభలకు ఉద్దేశించి సైతం ప్రసంగాలను కూడా చేయడం జరిగింది. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తమ నేతలతో హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం పోడియం వద్దకు వచ్చిన వైసిపి సభ్యుల సైతం ప్రతిపక్ష హోదాని సైతం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి జగన్ తో సహా వైసిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం వాక్ అవుట్ కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా జగన్ ఆరోగ్య నిర్ణయంతో వైసిపి నేతలు అందరూ కూడా సపోర్టుగా ప్రతిపక్ష హోదా అందించాలని డిమాండ్ చేశారు.


అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం తర్వాత గత ప్రభుత్వంలో వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. సభ ప్రాంగణం సమయానికి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ చేరుకోగా.. గవర్నర్ ప్రసంగం చేస్తున్న కొద్దిసేపటికి వైసీపీ సభ్యులు తెలియజేశారట. సభ్యులు నిరసన చేసిన సమయంలోనే జగన్, బొత్స తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు తెలియజేయడం జరిగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడడం జరిగిందట. ఆ తర్వాత ఏ అంశాల పైన చర్చించాలని విషయం పైన నిర్ణయం తీసుకోబోతున్నారట.


సుమారుగా 3 వారాల పాటు ఈ సభలు నిర్వహించారని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూందట. సీఎం చంద్రబాబు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేశారు ఆ తర్వాత రెండు రోజులు సభ వాయిదా పడబోతోంది. తిరిగి ఈనెల 28న సభ ప్రారంభం కాబోతోంది.. 2025-26 వార్షిక బడ్జెట్ని సైతం ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ నేతలు హాజరు అవుతారా లేదా అనే విషయం  ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది.. రేపటి నుంచి రెండు రోజులపాటు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లబోతున్నారట. అక్కడ జరిగే పలు రకాల కార్యక్రమాలలో కూడా పాల్గొనబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: