ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి చెందిన నేతలు నిలబడిన చోట అన్ని నియోజకవర్గాలలో గెలుపొందారు. అయితే కూటమిలో భాగంగా పేరు పెద్దగా వినిపించకపోయిన కానీ అక్కడక్కడ మాత్రం కొంతమంది జనసేన నేతల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే విప్ బొమ్మిడి నాయకర్ అస్వస్థకు గురి అయ్యారట. గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉన్నారట ఈ ఎమ్మెల్యే.


ఈ విషయంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రి భీమవరంలో చేర్పించారట. అక్కడ వైద్యులు  సైతం పరీక్షల అనంతరం ఈయనకు టైఫాయిడ్ జ్వరం వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జనసేన ఎమ్మెల్యేను హైదరాబాదుకి తరలించడానికి ఏర్పాటు చేశారట. అలాగే అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తూ ఉండగా ఈ నెల రెండవ తేదీన ఒక ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొని బయటపడ్డారు. మచిలీపట్నం దగ్గర కారు వెళుతూ ఉండగా బైకు అడ్డు రావడంతో ఈయన కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురై ముళ్ళ పొదలలోకి దూసుకు వెళ్లిందట. గత కొన్నేళ్లుగా అక్కడ హైవే పైన వాహనాలు వేగంగా వెళుతూ ఉండడంతో కొంతమంది బైకులతో రోడ్డుకు అడ్డంగా వచ్చి ఇలాంటి ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారని స్థానికులు కూడా వెల్లడించారు.

అయితే ఆ సమయంలో ఈ ఎమ్మెల్యే కారులోనే ఉన్నారని కానీ ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో కార్యకర్తలు నేతలు కూడా కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇలా ఒక్కసారిగా అనుకోకుండా తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయనను చూసి చాలామంది కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఆయన ఆరోగ్యం పైన వినిపిస్తున్న ఈ వార్తలకు జనసేన ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: