
దీంతో ఆ స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న జంగా కృష్ణమూర్తి , దువ్వవరపు రామారావు , పరుచూరి అశోక్ బాబు , తిరుమల నాయుడు , యనమల రామకృష్ణుడు లాంటివారు మాజీలు కాబోతున్నారు .. వీరు రాజీనామా చేస్తున్న సీట్లకు కొత్తగా ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగబోతున్నాయి .. ఇక వీటికోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూలను విడుదల చేసింది .. ఈ ఐదు సీట్లకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న విడుదల కాబోతుంది .. అలాగే మార్చు 10 వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఇచ్చారు ..
మార్చ్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది .. ఆ తర్వాత 13న ఉపసంహరణకు గడువు ఇచ్చారు .. మార్చ్ 20న ఈ ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి .. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది .. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు . మార్చ్ 24న గెలిచిన ఎమ్మెల్సీలు పదవి బాధ్యతలు చేపడతారు . అయితే ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లను కూటమి ఏకపక్షంగా గెలుచుకోబోతుంది.. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి 175 సీట్ల అసెంబ్లీలో 164 సీట్లతో కూటమి 5 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవడం లాంచనమే దీంతో వైసీపీకి ఈసారి నిరాశ తప్పదు .