
దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వంలో కుదుపు నెలకొంది. తన వ్యక్తిగత కారణాలతోనే... ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా... అధికారిక ప్రకటన చేశాడు జీవీ రెడ్డి. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని.. రాజకీయాల జోలికి అస్సలు పొనని... వెల్లడించారు జీవి రెడ్డి. ఇది ఇలా ఉండగా ఏపీ ఫైబర్ నెట్ ఎండి, ఐఏఎస్ దినేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జీవి రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణల నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి... జీవి రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందట. జీవి రెడ్డికి... గట్టిగా సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థంపర్థం లేని ఆరోపణలు దినేష్ కుమార్ పైన ఎందుకు చేశావని... ఫోన్ చేసి మరి జీవి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సంఘటన గత నాలుగు రోజుల కిందట జరిగిందని చెబుతున్నారు.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడంతో... నాలుగు రోజుల నుంచి అసలు ఎవరినీ కలవలేదట జీవి రెడ్డి. ఈ తరుణంలోనే తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు జీవి రెడ్డి. పైకి న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని చెప్పినప్పటికీ... ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అంటున్నారు. భవిష్యత్తులో వైసీపీ లేదా కాంగ్రెస్ వైపు చూసే ఛాన్స్ లు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.