నిన్నటి రోజున టిడిపి పార్టీ నేత జీవి రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవితోపాటుగా టిడిపి జాతీయ ప్రతినిధిగా ఉండేటువంటి పదవికి కూడా రాజీనామా చేస్తూ ఒక లేఖను కూడా నిన్నటి రోజున పంపించడం జరిగింది. అయితే ఇలా రాజీనామా చేయడం వెనక తన వ్యక్తిగత కారణం ఉందని తెలియజేశారు జీవిరెడ్డి. ఇకమీదట న్యాయవాది వృత్తిలోనే తాను ఎక్కువగా కొనసాగుతూ ఉంటానని తెలియజేశారు. అయితే ఈ విషయం విన్న టిడిపి నేతలు కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి మద్దతు పలుకుతూ ఉన్నారు.


దీంతో చంద్రబాబుకు సైతం చురకలు అంటించేలా పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలకే ఇటువంటి ఆలోచనలు టిడిపి నేతలు చేసేలా చేశారంటూ పలు రకాల ఆరోపణలు సీఎం చంద్రబాబుకి ఎదురవుతున్నాయట. ఏపీ ఫైబర్ కూటమి ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని.. కనెక్షన్ ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నారని దీనిపైన అటు కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు కూడా చాలా విమర్శలు కూడా వినిపించేలా చేస్తున్నారట. ఇవన్నీ కూడా జీవీ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలకు దారి తీసేలా చేశాయట.




ఇటీవలే ఐఏఎస్ అధికారి కూడా దినేష్ కుమార్ పైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడంతో వీటన్నిటినీ కూడా ఆయన భరించలేక నిన్నటి రోజున రాజీనామా చేశారట. APSFL 410 మంది అక్రమ నియామకాలను సైతం రద్దు చేస్తే వాటిని తొలగించకుండానే జీతాలు అందాల చేస్తున్నారని చెప్పడంతో పాటగా అందుకు కారణం అధికారులు అంటూ నిలదీశారట. అలాగే జీఎస్టీ అధికారులు కూడా 370 కోట్ల పెనాల్టీ విధించారట. వీటన్నిటికీ కారణం కూడా దినేష్ కుమార్, రామానాయుడు నుంచి రికవరీ చేయాలని చెప్పారట. దీంతో విజిలెన్స్ అధికారులు కూడా 60 కోట్ల రూపాయలను నిలిపి వేయాలని చెప్పిన కూడా వీరు చెల్లించడంతో ఈ డబ్బులను వీరి నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. ఈ విషయం పైన అటు దినేష్ కుమార్, రామానాయుడు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్ ఫిర్యాదు చేయడం జరిగిందట . అంతేకాకుండా గత ప్రభుత్వంలోని అన్ని సేవలు బాగా ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారనే విధంగా జీవి రెడ్డి పైన సీఎం చంద్రబాబుకు పలు రకాల వ్యాఖ్యలు చెప్పినట్లు వార్తల వినిపిస్తున్నాయి.. గత ప్రభుత్వంలో అధికారులు నిర్లక్ష్యం వల్లే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా నష్టపోయారని.. దీన్ని బట్టి చూస్తే మరో ఆరు నెలలలోనే APSFL మూత పడిపోవడం ఖాయం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధికారం చేపట్టిన 9 నెలలకే ఇలాంటి నేతలను వదులుకోవడం టిడిపి పార్టీకి పెద్దదెబ్బే అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: