
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... వైసిపి ప్రభుత్వ వ్యతిరేకతను.. జనాలకు మీడియా ముందుకు వచ్చి కళ్లకు కట్టినట్లు చూపించారు జీవి రెడ్డి. ఈ తరుణంలోనే... జీవి రెడ్డి కి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చారు. అది కూడా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి. దీంతో జీవి రెడ్డి పంట పండిందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి.... ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా జీవీరెడ్డి గుడ్ బాయ్ చెప్పారు.
అయితే ఉన్నఫలంగా తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడం వెనుక పెద్ద కుట్రలో జరిగాయట. జీవి రెడ్డిని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా తిట్టినట్లు తెలుస్తోంది. వేమూరి హరికృష్ణ సలహాలు సూచనలు తీసుకోవాలని పదేపదే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్.. జీవి రెడ్డికి సూచించారట. అయితే ఇదే విషయం జీవి రెడ్డికి అస్సలు నచ్చలేదని తెలుస్తోంది.
దీంతో... జీవి రెడ్డికి ఫోన్ చేసి మరి నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు దారుణంగా తిట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయం అస్సలు నచ్చక జీవి రెడ్డి వెంటనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ముందు తాను రాజకీయాల్లోకి అస్సలు రాబోవునని ప్రకటించేశారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని వివరించారు జీవి రెడ్డి. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారు.