ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి రాజీనామా చేయడం రాజకీయంగా ఒకింత సంచలనం అయింది. వ్యక్తిగత కారణాల వల్లే పదవికి రాజీనామా చేశానని జీవీ రెడ్డి చెబుతున్నా ఆయన రాజీనామా వెనుక చోటు చేసుకున్న పరిణామాలు తెలియనివి కావు. చంద్రబాబు, నారా లోకేశ్ జీవీ రెడ్డిని తిట్టారని అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
 
వేమూరి హరికృష్ణ మాట వినాలని, ఆయన చెప్పింది ఫాలో కావాలని జీవీ రెడ్డికి సూచించగా జీవీ రెడ్డి మాత్రం ఆ కామెంట్లను లెక్క పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం అందుతోంది. మరోవైపు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై కూడా కూటమి సర్కార్ బదిలీ వేటు వేసిందనే సంగతి తెలిసిందే. దినేష్ కుమార్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని కూటమి సర్కార్ ఆదేశించడం గమనార్హం.
 
జీవీ రెడ్డి రాజీనామాకు ఏపీ సర్కార్ సైతం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. జీవీ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి కొంతమందికి నోటీసులు సైతం జారీ అయ్యాయనే సంగతి తెలిసిందే. జీవీ రెడ్డి భవిష్యత్తు సైతం ఏ విధంగా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.
 
న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న జీవీ రెడ్డి గతంలో వైసీపీ సర్కార్ చేసిన తప్పులు వెలుగులోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని కూటమి వదిలించుకోవడం పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. రాబోయే రోజుల్లో జీవీ రెడ్డి మళ్లీ కూటమిలో చేరి పార్టీ పరంగా యాక్టివ్ అయితే బాగుంటుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కూటమికి మరి కొందరు నేతలు, అధికారులు  షాకిస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: