
అదే క్రమంలో గన్నవరం టిడిపి ఆఫీస్ దాడి కేసులో సిఐడి అన్ను విచారణ కోసం కోర్టులో పీటి వారెంట్ కూడా దాఖలు చేసి అనుమతి తీసుకుంది .. ఇక దీంతో ఇవాళ విజయవాడ సబ్ జైల్ నుంచి వంశీని సిఐడి వారు అదుపులోకి తీసుకొని పిటి వారెంట్ పై కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది .. ఇదే క్రమంలో వంశీ రిమాండ్ ఈరోజుతో ముగుస్తున్న నేపథ్యంలో పోలీస్ వేసిన కస్టడీ పిటిషన్ పై కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక గన్నవరం టిడిపి ఆఫీసు పై దాడి ఇష్యుల వంశీని మూడు రోజులపాటు పోలీసులకు కస్టడీకి ఇస్తూ నిన్న విజయవాడ కోర్ట్ కీలక తీర్పు జారీ చేసింది . ఇక దాంతో పోలీసులు ఇవాళ ఆయన్ను విజయవాడ సబ్ జైలు నుంచి విచారణకు తీసుకువెళ్లన్నురు .. వంశీ లాయర్ సమక్షంలోని విచారణ జరగబోతుంది ..
ఇదే క్రమంలో వల్లభనేని వంశీ భూ కబ్జాలపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏలూరు డిఐజి జీవిజి అశోక్ కుమార్ నేతృత్యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేసింది .. ఇక వీటితోపాటు ఈ సీట్ విచారణ కూడా మొదలు కాబోతుంది .. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో వంశీ పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారన్నట్టు అర్థమవుతుంది. మరోపక్క వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు ఇప్పటికీ కొట్టి వేసింది . ఇక ఇప్పుడు వరుస విచారణల నేపథ్యంలో హైకోర్టులో మరో బుయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు .. ఇందులో ఊరట దక్కితే సరే సరే లేకపోతే వంశీ కష్టాలు మరింత రెట్టింపు కాబోతున్నాయి .. అలాగే జైల్లో అదనపు వసతూల కోసం వంశీ వేసిన విజ్ఞప్తిని విజయవాడ కోర్టు మన్నించడం మినహ ఆయనకు ఈ మధ్యకాలంలో ఎలాంటి ఉరటా లభించలేదు.