
ఫైబర్ నెట్ చైర్మన్ గా తనకున్న అధికారాలను మించి ఏదో తన వెనక వారికి మంచి చేయాలనుకున్నాడు .. ఇది కూడా ఆయన పార్టీ కోసం ఫైబర్ నెట్ కోసమే చేయాలనుకున్నారు .. అయితే ఆయన చేసిన విధానం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది .. ఇప్పుడు ఫలితంగా ఆయన రాజీనామా చేశారు .. ఆగ్రహంతో పార్టీకి కూడా రాజీనామా చేశారు .. దాంతో కష్టపడిన కార్యకర్తలకు ఇదా గుర్తింపు అని కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ అసలేం జరిగిందో తెలియదు.. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు .. కానీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు .. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల మాత్రం .. వ్యతిరేక కామెంట్లతో రెచ్చిపోతున్నారు.. జీవి రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు తీరును ప్రశ్నిస్తూ వందల కొద్ది పోస్టులు పెట్టేస్తున్నారు .. పార్టీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు కావాలని ఎందుకు వదులుకుంటాడు ? ముఖ్యమంత్రిగా ఆయన వ్యవస్థల గౌరవాన్ని కాపాడుతూ పార్టీని నిలబెట్టుకోవాలి..
జీవి రెడ్డి వైపు తప్పు జరిగిందనేది వాస్తవం .. ఆయన ఆవేశపడ్డారు అలాంటి సమయంలో పార్టీ పెద్దల సూచనలకు తగ్గట్టు వ్యవహరిస్తే సరిపోయేది .. పార్టీ కోసం ఒకరిద్దరి కార్యకర్తలు నేతలు కష్టపడితే సరిపోదు కదా టిడిపికి ఉన్న కార్యకర్తలంతా కష్టపడితేనే పార్టీ గెలుస్తుంది .. అంతేకానీ ప్రతి విషయంలో ఇలా వ్యతిరేక అర్ధాలు తీస్తూపోతే ఎవరిక నష్టం? ఇదే క్రమంలో అందరూ గత వైసిపి ప్రభుత్వం ఉంటే అలా చేసేది అంటూ భారీ సలహాలు ఇస్తారు.. నిజమే వైసిపిల లేదా వైసిపి కన్నా గోరంగా చేస్తే టిడిపికి ఓట్లు వేయాలని ప్రజలు ఎందుకు భావిస్తారు .. ఆ మాత్రం దానికి వైసిపి ఉంటే సరిపోదా అనుకోరా.. రాజకీయాల్లో ఆవేశాలకు చోటు ఉండకూడదు కేవలం ఆలోచనలతోనే .. సమయం చూసుకొని ముందుకు వెళ్లాలి .. వ్యవస్థల్ని కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయి అన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలి అంటూ కోందరూ సలహా ఇస్తున్నారు .. అయితే టిడిపి క్యాడర్ పేరుతో సోషల్ మీడియా క్యాడర్ మాత్రం విజయమంత మా వల్లే అన్నట్లుగా డైలాగులు కొడుతూ ప్రతి విషయాన్ని పెద్ద ఇష్యూగా చేస్తూనే వస్తున్నారు .. ఇక ప్రభుత్వం కూడా టిడిపి కార్యకర్తల మనోభావాలను గుర్తుంచుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ప్రకారం .. అనుకున్న నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది .. అలాగే ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం చేసుకోవాలి లేకపోతే ఈ సమస్యలు మరింత పెరిగిపోతాయి.