
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గెలుపు .. ఓటములు అధికారం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా తిరగ లేని బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. జగన్ అంటే ఒక బలమైన మాస్ లీడర్ .. జగన్ ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు 10 ఏళ్లకు పైగా ఎదురు చూపులు చూశారు. వాస్తవంగా చెప్పాలి అంటే జగన్ పడిన కష్టం అలాంటిది జగన్ అంతగా రాటు తేలేరు. చాలామందికి తమ తండ్రులు రాజకీయం వారసత్వంగా ఇచ్చారు. జగన్ కు కూడా రాజకీయం వారసత్వంగానే వచ్చింది .. అది కేవలం కడప ఎంపీ అయ్యేందుకు మాత్రమే ఉపయోగపడింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పుడు బలమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి బయటికి వచ్చి వైసీపీ స్థాపించిన జగన్ .. తొలిసారి ఓడిపోయిన ప్రతిపక్షంలో 67 సీట్లు సాధించి దేశ స్థాయిలో తన కంటూ తెచ్చుకున్నారు.
అదే జగన్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 151 యొక్క సీట్లు సాధించి అప్రతిహత విజయంతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. జగన్ 2014 లో కసి తో రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో అధికారంలోకి వచ్చాడు. మరి అదే జగన్ లో ఓ సారి ముఖ్యమంత్రి అయ్యి ఓడిపోయాక ఈ సారి మునుపటి కసి కనిపించడం లేదు. జగన్ లో పాత కసి ఎందుక కనిపించడం లేదో ఎవ్వరికి అర్థం కావడం లేదు. వైసీపీకి .. జగన్ కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కట్ట కట్టుకుని కూటమి కట్టి పోటీ చేసినా జగన్ కు 40 % ఓట్లు రావడం అంటే మామూలు రికార్డు కాదు. ఇన్ని అనుకూలాంశాలు ఉండి కూడా జగన్ ఇలా రాజకీయం చేస్తే 2029 లో ఎలా గెలుస్తాడు.. మళ్లీ ఎలా ముఖ్యమంత్రి అవుతాడన్నది జగనే ఆలోచన చేసుకోవాలి.