- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవులు కోసం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ నెల‌కొంది. ఓవైపు సీనియర్లు మరోవైపు జూనియర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ విజయం కోసం తామ పడిన కష్టాలను వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు ప్రణాళికలు రచిస్తూనే ఢిల్లీ స్థాయి లో లాబీయింగ్‌ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలం మేరకు కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అందులో ఒక సీటు ను మజ్లిస్ పార్టీకి ఇవ్వాలని యోజనలో ఏఐసీసి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో ఎమ్మెల్యే .. ఎంపీ లేదా చివరికి గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న వందల కోట్లు ఖర్చు అవుతోంది. పోలింగ్ పూర్తయ్య వరకు పార్టీ క్యాడర్కు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాలైన వస‌తులు కల్పించాలి .. అయితే అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం పైసా ఖర్చు అవసరం లేదు .. కేవలం పార్టీ పెద్దలు ఆశీస్సులు ఉంటే సరిపోతుంది. ఏకంగా ఆరేళ్లపాటు పదవిలో కొనసాగవచ్చు అందుకే ఈ ఎమ్మెల్సీ పదవి కోసం లీడర్లు తెగ పోటీ పడుతున్నారు.


గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. అలాంటి అలాగే ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఒకవేళ హస్తం పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇస్తే విజయవంతం చేయడానికి కేడర్ కూడా లేదని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గ్రేటర్ పీఠం దక్కించుకోవడం కష్టమనే అనుమానాలు ఉన్నాయి అందుకే మజ్లిస్‌ సహకారం అవసరమైన అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తోంది. అందుకే ఒక ఎమ్మెల్సీ సీటును ఆ పార్టీకి ఇచ్చేందుకు ఏఐసీసీ రెడీ అయింది. ఎంఐఎం నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తో స్నేహాన్ని తెంచుకుని కాంగ్రెస్తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే. ఒక సీటు మజ్లిస్‌ పార్టీకి ఇస్తే మిగిలిన మూడు సీట్లను ఎస్సీ - బీసీ - ఓసీ నేతలకు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆశావాహకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరిలో అసెంబ్లీ.. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి ఈ ఎమ్మెల్సీ సీట్ల అభ్యర్థుల ఎంపిక గట్టి సవాల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: