మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏడుపాదుల వయసు లోను అలుపన్నది  లేకుండా ఎంతో చురుగ్గా ఉత్సాహంగా కనిపిస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు .. ఒకవైపు దేశ పాలన ను దిగ్విజయంగా చూస్తూనే మరోవైపు బిజెపి పార్టీ ని నడిపిస్తున్నారు .. ప్రధాన మంత్రి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలాంటి అలసట కు తావు లేకుండా సెలవు లేకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు .. ఆరోగ్యపరం గా యువతరాని కి ఎంతో ఆదర్శం గా నిలుస్తున్నారు . అయితే 74 ఏళ్ల వయసు లోను ఇంతా యాక్టివ్ గా  ఉంటున్న మోడీ ఏం తింటారు . .. అనే డౌట్ అందరి లో ఉంటుంది .
 

అయితే ఇప్పుడు తాజా గా  మోడీ తాను మెచ్చిన సూపర్ ఫుడ్ ఏమిటో స్వయంగా చెప్పారు .. సంవత్సరం లో 300 రోజులు ఆయన తినే ఆహారం ఏంటో చెప్పుకొచ్చారు .. సోమవారం బీహార్ లోని భాగల్‌పుర్ లో పర్యటించిన మోడీ తన ఆహార అలవాట్ల గురించి ప్రజలకు వివరించారు  . ... తనకి ఇష్టమైన ఫుడ్ మఖానా సూపర్ ఫుడ్ అని మోదీ చెప్పుకొచ్చారు . అలాగే ఆరోగ్యానికి ఇది ఎంతో ప్రయోజనం అని ఆయన ఈ మఖానను 365 రోజుల్లో 300 రోజులు తన ఆహారం లో  భాగం అయ్యేలా చూసుకుంటానని మోదీ ఆ మీటింగ్లో చెప్పుకొచ్చారు ..

 

అలాగే దేశంలో ఉన్న ఎందరో ప్రజలు మఖానాను అల్పాహారంగా తీసుకుంటారని . .. దాని ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిలో ఉందని మోదీ పేర్కొన్నారు .. అలాగే రైతుల శ్రేయస్సు కోసం బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటుకు వందకోట్లు కేటాయిస్తున్నామని . ..  ఈ బోర్డు ద్వారా ప్రొడక్షన్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని మోదీ తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: