- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంటే .. మార్చి 20 న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఏ వర్గం నుంచి ఎవరెవరు ? ఉన్నారు అన్న‌ దానిపై మీడియాలో రకరకాల చర్చలు వార్తల వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ నెలకొంది.


- ఓసి వర్గం నుంచి కే జానారెడ్డి - టీ జీవన్ రెడ్డి - వేం నరేందర్ రెడ్డి - టీ జగ్గారెడ్డి - పారిజాత నర్సింహారెడ్డి - హరివర్ధన్ రెడ్డి - జగదీశ్వరరావు - అలుగుబెల్లి ప్రవీణ్ రెడ్డి - నర్సారెడ్డి భూపతిరెడ్డి - కుసుమ కుమార్ - సామ రామ్మోహన్ రెడ్డి తదితరులు రేసులో ఉన్నారు.
- ఇక బీసీ వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ - ఎగ్గే మల్లేశం - మాజీ ఎమ్మెల్యే ఎరావత్రి అనిల్ - సంగిశెట్టి జగదీశ్వర్ రావు - సునీత ముదిరాజ్ - నీలం మ‌ధు మధురాజ్ - వజ్రేష్ యాదవ్ - చెవిటి వెంకన్న - ఉన్న కైలాష్ నేత - నవీన్ యాదవ్ - చరణ్ కౌశిక్ యాదవ్ రేసులో ఉన్నారు.


ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ - సంపత్ - సింగాపురం ఇందిర - కొండూరు పుష్పలీల - పిడమర్తి రవి - దొమ్మాట సాంబయ్య - రాచమల్ల సిద్దేశ్వర - దర్శన్ - జ్ఞాన సుందర్ - పామిని భీం భరత్ రేసు లో ఉన్నారు.
- ఇక మైనార్టీ వర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ .. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ .. నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్ - అజ్మతుల్లా హుస్సేని రేసు లో న్నారు.
బీఆర్ ఎస్ నుంచి ఎవ‌రంటే..
ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది. ఆ పార్టీ నుంచి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ - దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ - మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ - మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ రేసులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mlc