
ఈ రేషన్ కార్డు వల్ల సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా ఫ్రీగా ఉన్నత విద్యను పొందే అందుకు అవకాశం ఉన్నది. ఇటీవలే ఫ్రీ గ్యాస్ రేషన్ కార్డు లింక్ పెట్టడం జరిగింది. అలాగే పింఛన్కు కూడా రేషన్ కార్డు ని లింకు పెట్టింది. రాబోయే రోజులు సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేయడానికి సిద్ధమవుతోంది కూటమి. ముఖ్యంగా వీటికోసం ప్రత్యేక హోదా డీలర్ కూడా కేటాయించబోతున్నారట. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకు కూడా ఈ పథకం వల్ల అన్ని పథకాలను అందించేలా చేయబోతున్నారు.
ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే అర్హత ఉండి అప్లై చేసుకోవచ్చట. మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లుగా మంత్రి మనోహర్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ విధానాన్ని కూడా అమలు చేయబోతున్నారని క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులు కూడా రాబోతున్నాయని తెలిపారు. కార్డు ఉండి కార్డులో తప్పులు ఉన్న లేకపోతే అభ్యర్థులు చేరికలు సవరణలు వంటివి ఉన్నా కూడా వాటికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందట. సూపర్ సెక్స్ హామీలను అమలు చేయడానికి ముందుగానే ఈ కార్డులన్నీ కూడా అందించేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి డిజిటల్ విధానంలోనే రేషన్ కార్డులను జారీ చేయబోతోంది కూటమి ప్రభుత్వం.