
వైసిపి గవర్నమెంట్ లో చంద్రబాబు ఇంటి పై దాడికి ప్రయత్నించిన ఇష్యూలో కూటమి ప్రభుత్వం 20 మంది కి పైగా కేసులు నమోదు చేసింది . ఇక అందులో వైసిపి నేతలు దేవినేని అవినాష్ , జోగి రమేష్ కూడా ఉన్నారు .. అయితే చంద్రబాబు ఇంటి పై దాడి చేసే సమయాని కి జోగి రమేష్ కేవలం ఒక ఎమ్మెల్యే గానే ఉన్నారు .. అయితే ఇప్పటికే ఈ కేసులో వీరిని పోలీసులు పలుమార్లు విచారించారు .. అయితే ఆరెస్ట్ చేయకుండా గతంలో కోర్టు వీరికి ఆదేశాలు ఇచ్చింది .
ఇక ఇప్పుడు కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు గడువు ముగియడం తో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని అవినాష్ , జోగి రమేష్ సహ 20 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు .. అయితే ఆ కేసును విచారించిన ధర్మాసనం .. వీరికి ముందస్తు బేయిల్ మంజూరు చేసింది .. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తో వీరందరికీ భారీ ఊరట లభించింది .. అయితే వీరిని దేశం విడిచి వెళ్లొద్దని పోలీసుల దర్యాప్తుకు సకాలంలో సహకరించాలని ఆంక్షలు విధించింది .. అలాగే మరోపక్క ఈ కేసుల్లో మూడు సంవత్సరాలుగా దర్యాప్తు ముందుకు వెళ్లక పోవటంపై కూడా సుప్రీం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.