
ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాలు హాట్ టాపిక్ గా జరిగాయి .. ఈ క్రమంలోనే వైసిపి ఎమ్మెల్సీలు ఈ పథకాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు .. తాము అమలు చేసిన పథకాలన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది అంటూ విమర్శలు చేశారు .. అయితే ఈ క్రమంలోని మంత్రి నారా లోకేష్ వారి విమర్శలకు స్పందిస్తూ గట్టి సమాధానం ఇచ్చారు .. అలాగే శాసనమండలి సాక్షిగా సవాల్ చేస్తున్నానంటూ ఏప్రిల్ , మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు .. అలాగే ఎన్నికలకు ముందు తామచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నమని కూడా తెలిపారు .
ఇక రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు , పథకాలు అన్ని ప్రారంభమవుతాయని .. ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు .. అలాగే కీలకమైన తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ పథకాలు కూడా జూన్ లోపే అమలు చేయాలని నిర్ణయించారు .. అలాగే తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోపే లబ్ధిదారులకు ఇచ్చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .. ఈ క్రమంలోని ఏప్రిల్ , మే నెలలో ఈ రెండు పథకాలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రి లోకేష్ చేసిన ప్రకటన ఇప్పుడు లబ్ధిదారులకు ఆనందాన్ని ఇస్తుంది .