
ముఖ్యంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో దాడులు జరగడం చాలా దురదృష్టకమంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి తెలియజేశారు. ఈ విషయం పైన హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. గతంలో వైసీపీ నేతలతో కూడా మంచి అనుబంధమున్న సుబ్రహ్మణ్యస్వామి తాజాగా వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చాలామందిని భయపెట్టి మరి దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యంలో అసలు మంచిది కాదు అంటే తెలియజేశారు సుబ్రహ్మణ్యం. అంతేకాకుండా తాను కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్లీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదంటూ ఆయన ఆరోపించారు.
ఈ విషయం పైన కోర్టు చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ దాడులు సంస్కృతి చట్టంగా మారుతాయని ఆయన తెలియజేశారు. మంచి విషయం పైన ఎవరు మాట్లాడినా కూడా పార్టీలకు అతీతంగానే ఉంటాను అంటూ తెలియజేశారు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వైసీపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ సుబ్రహ్మణ్యం కూడా అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఒకటే పార్టీ ఉంది కనుక కచ్చితంగా ఆ పార్టీకే ఇవ్వాలని అందులో ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని కూడా తెలిపారు. తిరుపతి లడ్డు కల్తీ అంశం ముగిసిపోయింది కల్తీ జరగకుండానే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసిందని విషయాలను కూడా తెలిపారు. తిరుపతి లడ్డు పైన అసత్యాలు చేయడం పెద్ద తప్పు అంటూ తెలిపారు.