
కానీ కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడుతోంది. అక్కడ గులాబీ పార్టీ పోటికి దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ నే తట్టుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. తెలంగాణ ప్రజలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ మైక్ పెడితే తిట్టేస్తున్నారు జనాలు. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పై కాస్త వ్యతిరేకత ఉన్నది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో అగ్నిపరీక్షగా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీకి..! అందుకే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసమే చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే తాజాగా కరీంనగర్ వెళ్లి... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గులాబీ పార్టీ అలాగే బిజెపి పార్టీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ అలాగే కేసీఆర్ను అరెస్టు చేయకుండా బిజెపి పార్టీ నాటకాలు ఆడుతోందని.. కేంద్ర సంస్థలతో అడ్డుపడుతోందని పడ్డారు.
కాంగ్రెస్ పథకాలు.. అందినవారు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పర్వాలేదు... అంటూనే నా ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదంటూ బాంబు పేల్చారు. ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోయిన మాత్రాన.. తన ప్రభుత్వాన్ని కూల్చలేరని గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కడ ప్రచారం చేసిన కాంగ్రెస్ ఓడిపోతుందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.