
మత్స్యకారులకు 20వేల రూపాయలు (చేపల వేటకు వెళ్ళని పరిస్థితులలో) అందిస్తామని అది కూడా ఏప్రిల్ నెలలో ఇస్తామని తెలిపారు, నిరుద్యోగులకు 3000 రూపాయలు భృతి ఇస్తామని.. డీఎస్సీ 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని.. చదువుకొననే ప్రతి ఒక్క పిల్లలకు 15వేల రూపాయలు చొప్పున అందిస్తామంటూ తెలియజేశారు..త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని.. అది కూడా 3 విడుదలలో 20వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. కేంద్రం ఇస్తున్న 6000 రూపాయలకి 14 వేల రూపాయలను జత చేసి ఇస్తామని వెల్లడించారు.అలాగే అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు అందిస్తామంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది.
అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు పైన కూటమి ప్రభుత్వం పైన కొంతమేరకు విమర్శలు వినిపిస్తున్న సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని విధంగా ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలోపు అన్ని హామీలను సైతం అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి సూపర్ సెక్స్ హామీలు అమలు తర్వాత కూటమికి మైలేజ్ పెరుగుతుందేమో చూడాలి.