హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా 22వ బయో ఆసియా సదస్సు ఘనంగా ప్రారంభమైంది. వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల సీఈఓ లు, చైర్మన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు అంతర్జాతీయ కంపెనీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికాకు చెందిన లైఫ్ సెన్సెస్ ఎంఎస్డితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. లాస్ట్ ఏంజిల్స్ కు చెందిన ఆజిలిసియం సంస్థ తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.


మెయిసీ ఫార్మా హైదరాబాదులో రెండో కార్యాలయాన్ని ప్రారంభించదానికి అంగీకరించింది. గ్రీన్ ఫార్మసిటీలో కంపెనీల ఏర్పాటుకు మరో పదకొండు కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. గ్రాన్యుల్స్, ఆర్బిక్యులర్, అయిజెంట్, బయోలాజికల్ ఈ, వీర్కో, విరూపాక్ష, జూబ్లియంట్ విమ్టా, ఆరజెన్, భారత్ బయోటెక్, సాయి లైఫ్ సెన్సెస్ లు 5445 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు పదివేల కొత్త ఉద్యోగాలు ఈ కంపెనీల ఏర్పాటు వల్ల రానున్నాయి.  


ఇప్పటికే గ్రీన్ ఫార్మాసిటీలో ఆరు ఫార్మా కంపెనీలు తమ కంపెనీలను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో మొత్తం పదకొండు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 22,000 మంది పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. డిజిటల్ హెల్త్ కేర్, కృత్రిమ మేధా పరిశోధనలో  పరస్పరం సహకరించుకునేలా క్వీన్స్ లాండ్ యూనివర్సిటీతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ అవగాహన ఒప్పందం కుదురుచుకుంది. డిజిటల్ హెల్త్ విభాగంలో ఇండియన్ డిజిటల్ హెల్త్ ఆక్టివేటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


ఇన్నోవేషన్ ఫార్మసూటికల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ తోనూ అవగాహన ఒప్పందం కుదిరింది. పేరుందిన 11 పరిశోధన అభివృద్ధి సంస్థలు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. హెల్త్ కేర్, మెడికల్ టెక్నాలజీ, డయాగ్నస్టిక్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ లో సహకారం అందించే విధంగా టీ హబ్ తో హెల్త్ ఇన్నోవేషన్ మాంచెస్టర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: