ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను బిజెపి నేతలు చాలా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోల్చుతూ... తమ బిజెపి పార్టీని టీమ్ ఇండియా గా అనువాదించుకుంటున్నారు బిజెపి నేతలు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్ కు వేసినట్లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గొడవను వాడుకుంటున్నారు. తాజాగా.. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వాడుకున్నారు.

 

ఈనెల 27వ తేదీన   కరీంనగర్ జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... గురువారం రోజున అంటే ఈ నెల 27వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ ఉందంటూ బాంబు పేల్చారు బండి సంజయ్. ఈ మ్యాచ్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 అయితే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  చేసిన ఈ వ్యాఖ్యల పైన.. కాంగ్రెస్ మంత్రులు అలాగే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బండి సంజయ్ నోరు తెరిస్తే చాలు పాకిస్తాన్ ఇండియా అంటూ మాట్లాడుతాడని.. మంత్రి సీతక్క కూడా ఆగ్రహించారు. ఓట్లు అడగాలంటే జనాలని ఆడుకోవాలి కానీ... ఇలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నట్టుగా గొడవలు సృష్టించకూడదని... చురకలు అంటిస్తున్నారు తెలంగాణ మంత్రులు.

 బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ అనడం తప్ప చేసిందేమీ లేదని మండి పడుతున్నారు. ఇది ఇలా ఉండగా.... ఉమ్మడి కరీంనగర్, మెదక్ నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే బిజెపి పార్టీ తరఫున అంజిరెడ్డి.. పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాజాగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసేందుకు కరీంనగర్ వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: