నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలను సైతం అసంతృప్తిని వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయట.. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన ,బిజెపి కూటమి గానే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.. మాలో మాకు 100 ఉంటాయి అయినప్పటికీ కూడా అన్ని సర్దుకుని ముందుకు వెళ్తామని చెప్పడంతో అటు జనసేన నేతలు కార్యకర్తలు కూడా తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


అంతేకాకుండా గడిచిన కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాష్ట్రానికి మరొక 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని తాను అనుకుంటున్నారని తెలియజేయడంతో దీనిపైన అటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా చాలా అసంతృప్తిని తెలియజేశారట. దీంతో ఇంకా 10 ఏళ్ల పాటు మేము టిడిపి జెండాలు మోయాల్సిందేనా అనే పరిస్థితి చాలా మంది నాయకులలో మొదలయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ మరొక 5 ఏళ్లు పొడిగించి 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్పడంతో ఈ విషయాన్ని చాలామంది తప్పు పడుతూ ఉన్నారు.


జనసేన పార్టీ ఎప్పుడు అధికారాన్ని చేపట్టదా.. కూటమిలో ఉంటేనే జనసేనకు, టిడిపి పార్టీకి బలం ఉంటుందా అనే విధంగా విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సీఎం సీటు షేరింగ్ అనే అంశాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్. కానీ ఆయన కార్యకర్తలు నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పటికీ కూడా సీఎం స్థాయిలో ఉంటారని తెలియజేయడంతో జనసేన పార్టీ నేతలు నిరాశకు గురవుతున్నారు. 15 ఏళ్ల పాటు వైసీపీ పార్టీకి అవకాశం ఇవ్వడం జరగదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ.. ప్రజలు మాత్రం ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయం మీ చేతులలో లేదని మా చేతులలో ఉందంటూ తెలుపుతున్నారు.. ముఖ్యంగా పరిపాలన బాగుంటే ప్రజల మద్దతు ఉంటుందని పలువురి నేతలతో పాటు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: