ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో... తాము హాజరవుతామని జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే.. మొదటిరోజు అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, వైసిపి పార్టీ సభ్యులు... తొలిరోజే బయటికి వెళ్లిపోయారు. దాదాపు 30 నిమిషాల పాటు ఉన్నారో లేదో కానీ... ఏపీ అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేశారు వైసీపీ పార్టీ సభ్యులు.


వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు జగన్కు సంబంధించిన ఎమ్మెల్యేలు. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం... దారుణంగా వ్యవహరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా రాబోదని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించేశారు. ఇక ఈ పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేసిన వైసీపీ పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.


కానీ మండలి సభ్యులు మాత్రం... వెళ్తున్నారు. ఏపీ మండలి లో వైసీపీ పార్టీకి మంచి బలం ఉంది. అందుకే అక్కడ వైసిపి సభ్యులు నిరంతరం కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీని దారుణంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 11 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు సరిగ్గా 11 గంటలకు అసెంబ్లీకి వచ్చారని సెటైర్లు పెంచారు చంద్రబాబు నాయుడు. సరిగ్గా 11 గంటల 11   నిమిషాల వరకు అసెంబ్లీలో ఉండి... బయటకు వెళ్లిపోయారని కూడా సెటైర్లు పేల్చారు.


ఆ 11 నిమిషాలు ఉండి కూడా... ఏపీ స్పీకర్ అయ్యన్నను అవమానించారని చంద్రబాబు నాయుడు... ఆగ్రహించారు. ఏపీ ప్రజల పక్షాన ఉండి పోరాడేల్సింది పోయి... వైసిపి నుంచి వెళ్లిపోయి దాక్కున్నారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ధైర్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు  కావాలని కోరడం జరిగింది. ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు సంపాదించకుండా ఇప్పుడు కావాలి అంటే ఎలా అని నిలదీశారు చంద్రబాబు నాయుడు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: