PK సంచలన ప్రకటన చేశారు... తమిళనాడు సీఎంగా విజయ్‌ కాబోతున్నారని చెప్పకనే చెప్పారు ప్రశాంత్‌ కిషోర్‌. ఇవాళ చెన్నైలో విజయ్ పార్టీకి సంబంధించిన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. నా ఆలోచన, వ్యూహాలు విజయ్ కు అవసరం లేదని వివరించారు. హీరో విజయ్ కు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదని తెలిపారు. గత నాలుగు ఎళ్ళు నేను ఎవరికి‌ పనిచేయలేదని పేర్కొన్నారు. కాని నేను ఈ వేడుకకు రావడానికి కారణం నా బ్రదర్ విజయ్‌ అన్నారు పీకే.

టివీకే పార్టీ ఒక కోత్త రాజకీయ చరిత్ర ను తమిళనాడులో రచిస్తుందని ప్రకటించారు. తమిళ నాడు మార్పు కోరుకుంటోంది...అ సమయం వచ్చిందని తెలిపారు. ఒక కోత్త రాజకీయ విజయ్ ప్రజలకు పరిచయం చేస్తారన్నారు.  గత 35 ఎళ్ళుగా ఉన్న రాజకీయాన్ని విజయ్ తన ఆలోచనలతో మార్పు తీసుకుని వస్తారని స్పష్టం చేశారు పీకే. విజయ్  అలోచనలు, సమాజం పై ఉన్న ప్రేమా ,బాధ్యత నాకు తెలుసు అని ప్రశంసించారు. అందుకే విజయ్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చానని ప్రకటన చేశారు.

వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలలో టివికే పార్టీ గెలిచిన తరువాత నేను స్వయంగా తమిళంలో మాట్లాడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతానన్నారు. తమిళనాట అవినీతి, కుటుంబ పాలనా పోవాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలని కోరారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉందని ఆగ్రహించారు. అవినీతి, కమ్యూనిజం,కుటుంబ పాలనా తమిళనాడులో పోవాలని కోరారు. నాకంటే ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఎక్కువ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ వచ్చే ఎన్నికలలో టీవికే పార్టీనీ గెలిపించి ధోనీ కంటే ఎక్కవ క్రేజ్ ను తమిళనాడులో నేను సంపాదిస్తానన్నారు  ప్రశాంత్‌ కిషోర్‌.  రానున్న రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోని గెలిపిస్తే‌‌‌‌‌‌‌‌...‌నేను విజయ్ అద్వర్యంలో టివికే పార్టీనీ గెలిపిస్తానని తెలిపారు  ప్రశాంత్‌ కిషోర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: