
వంశి పైన నమోదైన ఈ తాజా మూడు కేసుల విషయానికే వస్తే.. ఆత్మకూరులో ఒక పొలం వివాదంలో వల్లభనేని వంశీ పైన అతని అనుచరుల పైన దౌర్జన్యం చేశారనే విధంగా పోలీస్ కేసు నమోదు చేయించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అక్రమంగా చేయించారని ఈ విషయం ఎవరికైనా చెబితే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని ఫిర్యాదులో బాధితులు సైతం వెల్లడించారట. దీంతో ఆత్మకూరులో ఈ పోలీస్ కేసు నమోదు అయ్యిందట.
అలాగే మరొకవైపు వీరవల్లిలో ఒక కంపెనీ వచ్చిన సమయంలో రైతులకు సైతం ఇచ్చినటువంటి పరిహారం ఇవ్వడంలో చాలా అవకతవక ఏర్పడ్డాయని రైతులు ఫిర్యాదు ఇవ్వడంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం
అలాగే ఒక న్యాయవాది భూమి కబ్జా చేశారని ఆ న్యాయవాది భార్య గన్నవరంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేశారని ఫిర్యాదు.. దీనివల్ల ప్రభుత్వానికి నష్టమని కేసు నమోదు అయినట్లుగా పోలీసులు తెలియజేశారు. మొత్తానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన ఇలా కేసులతో చాలా ఇబ్బందులకు గురిపెట్టేలా కనిపిస్తూ ఉన్నారు. మరి వీటి పైన వల్లభనేని వంశీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మరి ఈ కేసులు అన్నిటిని దాటుకొని వంశీ బయటికి వస్తారా రారా చూడాలి.