
ముందుగా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో కచ్చితంగా చూసుకోవాలి .. మీకు ఓటు ఉంటే వార్డు సచివాలయం సిబ్బంది మీకు ఇప్పటికే స్లిప్ అందించి ఉంటారు .. లేకుంటే మీరే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది .. ఆ స్లిప్పుతో పాటు ఏదో ఒక గుర్తింపు పత్రంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి .. ఇక స్లిప్ లేకపోయినా పోలింగ్ కేంద్రం నెంబర్ , మీ వరుస సంఖ్య తెలిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు .. ఇక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళగానే మీ పేరు ఆ జాబితాలో ఉందో లేదో సరిచూసుకొని బ్యాలెట్ పత్రం ఇస్తారు .. ఇక్కడి వరకు పాత సాధారణ ఎన్నికల పద్ధతిలోనే ఉంటుంది .. మీకు నచ్చిన బ్యాలెట్ పేపర్లో పట్టబదుల పేరు ఫోటోలు ఉంటాయి .. దానిలో మీరు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది .. అంటే మొదటి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఒకటి అనే నెంబర్ వేయాలి .. మిగిలిన వారికి రెండు మూడు ఇలా నెంబర్లు ఇవ్వచ్చు .. మీరు ఇక్కడ ఒకరికే ఓటు వేయాలి అనుకుంటే ఒకటి అని మాత్రమే వేయవచ్చు .. అయితే బ్యాలెట్ పేపర్ పై ఓటు వేసే సమయంలో అక్కడి సిబ్బంది ఇచ్చే పెన్నను మాత్రమే వాడాలి .
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఒకే నెంబర్ వేయకూడదు .. అంటే ఇద్దరు ముగ్గురికి ప్రాధాన్యత నెంబర్లు ఇవ్వాలి అని అనుకుంటే .. ఒకటి రెండు మూడు అని రాయాలి కానీ ..2, 2, 2 ఇలా వెయ్యకూడదు .. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఇంగ్లీషులో తెలుగులో కానీ నెంబర్లు ఇవ్వకూడదు .. అంకెల్లో మాత్రమే అక్కడ రాయాలి .. అలా అంకెలు వేయటం కంప్లీట్ అయిన తర్వాత ఎన్నికల సిబ్బంది సూచించిన విధంగా మడత పెట్టాలి .. అంకే వెయకుండా బ్యాలెట్ తిరిగి ఇచ్చిన అది చెల్లదు .. అలాగే బ్యాలెట్ పేపర్ పై చుక్కలు , టిక్కులు వంటివి కూడా పెట్టకూడదు .. వారు సూచించిన గడిలోని అంకె వేయాలి .. ఒకటవ ప్రాధాన్యం ఇవ్వకుండా మిగిలిన నెంబర్లో వేసిన చెల్లదు .. వీటిపై కొంత అవగాహన ఉంచి ఓటు వేయడానికి వెళ్తే ఓటర్ కి ఎంతో సులువు ..