ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది .. ఇప్పటికే ప్రచారం ముగిసింది.. ఇక రేపు పోలింగ్ జరగబోతుంది .. రెండు గ్రాడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల్లో గెలుపు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనుంది .. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలవేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి .. ఇక ఎన్నికలకు వైసిపి దూరంగా ఉంది .. అయితే ఆ పార్టీకి మద్దతు దారుల ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారింది .. ఇక రెండు రోజులుగా క్షేత‌స్థాయిలో చోటు చేసుకుంటున్నా రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలవేళ ఉత్కంఠను పెంచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే పట్టభద్రుల , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా మారిపోతున్నాయి .. గతంలో ఎప్పుడూ లేనివిధంగా .. ఈ ఎన్నికల్లో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి ..


దాదాపు 100 నియోజకవర్గాల పరిధిలో జరగబోతున్న ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం స్పష్టంగా చెప్పబోతున్నాయి .. అయితే ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .. తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలవానని లక్ష్యంతో సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ నులు గట్టి సమీక్షలు చేశారు .. అలాగే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సందేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది .. కానీ వైసీపీ మద్దతు దారులుగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి వ్యూహాత్మకంగా వామ‌పక్షాల మద్దతుతో గ్రాడ్యుయేట్ సీట్లను గెలుచుకుంది .. ఇక ఇప్పుడు కూటమి వర్సెస్ పిడిఎఫ్ గా మారిన తరుణంలో రెండు నియోజకవర్గాల్లోను వైసిపి మద్దతు ఓటర్లు ఎంతో ఘననీయంగా ఉన్నారు .. ఇక వారి మద్దతు కోసం పిడిఎఫ్ భారీ ప్రయత్నాలు చేస్తుంది ..


 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన త‌ర్కాత‌ ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతున్న ఉభయగోదావరి , కృష్ణ గుంటూరు జిల్లాల్లో కూట‌మి క్లీన్ స్పీప్ చేసింది .. ఇక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది .. ఇక దీంతో కూటమి నేతలు కూడా అలర్ట్ అయ్యారు గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ స్థానుభూతిపరులు పిడిఎఫ్ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నట్లు పలు ప్రాంతాల నుంచి సమాచారం వస్తుంది .. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి ఏపీటీఎఫ్ కు మద్దతు ఇస్తుంది .. ఇక కొందరు బిజెపి నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి సపోర్టిస్తున్నారు .. ఉమ్మడి ఉదయ గోదావరి పట్టభద్రుల పోటీలో 35 మంది , కృష్ణ గుంటూరు స్థానానికి 25 మంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు .. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల నేతలకు పెద్ద సవాల్ గా మారాయి .. ఎవరికి వారు చివర ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు .. ఇక దీంతో తుది ఫలితం పైన ఉత్కంఠ పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: