తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే .. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలాల ప్రకారం కాంగ్రెస్ కు నాలుగు , బీఆర్ఎస్ కు ఒకటి వచ్చి ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతుంది .. అయితే అధికార కాంగ్రెస్ ఐదో స్థానానికి కూడా అభ్యర్థుని ప్రకటించి బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది .. అయితే అదే జరిగితే బీఆర్ఎస్ కు ఘటి షాక్కు తగిలినట్టే .. మరోపక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేరకు తమకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని సిపిఐ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తుంది .. మరి ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.


అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం గట్టి పోటీ పడుతున్నారు .. ఇందులో అద్దంకి దయాకర్ పేరు ముందు వరుసలో ఉంది .. తనను చట్టసభకు పంపిస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తన సన్నిహితులు వద్ద చెబుతున్నారు .. వీరితోపాటు సీనియర్ నేతలు జగ్గారెడ్డి , జీవన్ రెడ్డి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ , తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు .. అయితే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలో ఓడిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ నిబంధన పెట్టినట్టు తెలుస్తుంది .. దీంతో ఈ ముగ్గురికి అవకాశం కష్టమైనన్న‌ మరో ప్రచారం కూడా జరుగుతుంది.


ఇక గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న మరో సీనియర్ నేత బెల్లయ్య నాయక్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు .. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరు ఉన్న పటేల్ రమేష్ రెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు .. అయితే పార్టీ హైక‌మాండ్ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారు .. అలాగే ఎంపీగా అవకాశం ఇస్తానని పార్టీ నుంచి ఆ సమయంలో వచ్చిన హామీ కూడా అమలు కాలేదని .. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది .. అలాగే మరోవైపు బీసీ కోటలో అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారట. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలో గట్టి పోటీనే నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: