
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం గట్టి పోటీ పడుతున్నారు .. ఇందులో అద్దంకి దయాకర్ పేరు ముందు వరుసలో ఉంది .. తనను చట్టసభకు పంపిస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తన సన్నిహితులు వద్ద చెబుతున్నారు .. వీరితోపాటు సీనియర్ నేతలు జగ్గారెడ్డి , జీవన్ రెడ్డి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ , తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు .. అయితే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలో ఓడిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ నిబంధన పెట్టినట్టు తెలుస్తుంది .. దీంతో ఈ ముగ్గురికి అవకాశం కష్టమైనన్న మరో ప్రచారం కూడా జరుగుతుంది .
ఇక గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న మరో సీనియర్ నేత బెల్లయ్య నాయక్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు .. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరు ఉన్న పటేల్ రమేష్ రెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు .. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారు .. అలాగే ఎంపీగా అవకాశం ఇస్తానని పార్టీ నుంచి ఆ సమయంలో వచ్చిన హామీ కూడా అమలు కాలేదని .. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది .. అలాగే మరోవైపు బీసీ కోటలో అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారట. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలో గట్టి పోటీనే నడుస్తుంది.