
జీవి రెడ్డి విషయంలో తెలుగు దేశం పార్టీ వైపు నుంచి దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి! కార్యకర్తల్లో వ్యతిరేకతను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్టు టాక్ ? ఈ విషయాన్ని కొందరు పార్టీ నేతలు లోకేష్ , చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన లోకేష్ తన సన్నిహితుల ద్వారా జీవి రెడ్డిని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకునేలా ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ గొడవలో మూడు నెలల క్రిందటే చంద్రబాబు దృష్టికి కొన్ని విషయాలు వెళ్లినా ఆయన పెద్దగా పట్టించు కోకపోవడం కూడా ఓ కారణం అని.. అందుకే జీవి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే వరకు పరిస్థితి వెళ్లిందని అంటున్నారు.
జీవి రెడ్డి నిజాయితీ కల నాయకుడే అయినా .. ఆయనకు రాజకీయంగా పెద్దగా పరిణితి లేకపోవడం .. కాస్త ఆవేశం తో కూడిన నేత కావడం కూడా ఇక్కడ నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివాదం పెద్దది అయ్యేలా చేయడానికి కారణం అంటున్నారు. చంద్రబాబును కలిసి నప్పుడు ఆయన నోటి నుంచి సర్దుకు పోవాలి అన్న మాట రావడం తో పాటు చిన్నపాటి హెచ్చరిక కూడా రావడం తో తీవ్ర మనస్థాపాని కి గురైన జీవి రెడ్డి వెంటనే పార్టీ తో పాటు పదవికి కూడా రాజీనామా చేసేశాడంటున్నారు.
ఇలాంటి విషయాలలో కొందరు అధినేతలు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు.. చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఇది జీవి రెడ్డికి నచ్చపో వడంతో ఆవేశంతో నిర్ణయం తీసేసుకున్నారు. ఈ క్రమంలోనే సమస్య ను ఇంత దూరం తెచ్చిన ఫైబర్ గ్రిడ్ ఎండి దినేష్ కుమార్ పై కూడా వేటు వేశారు. అయితే జివి రెడ్డికి నచ్చ చెప్పి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు గట్టిగానే మొదలయ్యాయట. అలాగే ఆయన పార్టీ లోకి వచ్చినా ఇప్పటికిప్పుడు ఒరిగేదేం ఉండదు.. జాతీయ అధికార ప్రతినిధి పదవి కొనసాగుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చేలా చర్చలు నడుస్తున్నాయట.