ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... వైసిపి పార్టీకి చెందిన నేతలు అలాగే వైసిపి మద్దతుదారులను.. వరుసగా అరెస్టు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా... ఈ అరెస్టులు ఉన్నట్లు... చాలామంది ఇప్పటికే బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... తాజాగా మరో వైసీపీ మద్దతుదారుడి అరెస్టు జరిగింది. వల్లభనేని వంశీ ఎపిసోడ్ పూర్తికాకముందే... వైసీపీకి సపోర్ట్ చేసిన పోసాని కృష్ణ మురళి  అరెస్టయ్యాడు.

 హైదరాబాదులో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు.. శివరాత్రి రోజున అరెస్టు చేశారు. రాయదుర్గం మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్  లో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణ పోలీసుల పరిమిషన్.... హైదరాబాద్ వచ్చిన ఏపీ పోలీసులు తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటి పోలీసులు.... పోసాని కృష్ణ మురళిని  అరెస్టు చేయడం జరిగింది.

 మొదట అరెస్టు చేసిన తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ నుంచి ఏపీకి తరలిస్తున్నారు.  సినీ నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పైన గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సినిమా పరిశ్రమపై.. అలాగే నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రస్తుత మంత్రి నారా లోకేష్... ఇలా చాలామందిపై వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. పోసాని కృష్ణ మురళి రెచ్చిపోయి మాట్లాడారట.

 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ ను ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టి మరి బండ బూతులు తిట్టినట్లు పోసాని కృష్ణ మురళి పై కేసు కూడా ఉందట. మొన్నటివరకు రాంగోపాల్ వర్మ కు కూడా ఇలాంటి నోటీసులు జారీ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగా అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఎవరు ఊహించని విధంగా తాజాగా పోసాని కృష్ణమురళిని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు... రెండు తెలుగు రాష్ట్రాలలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు గురించే చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: