
అలాగే రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసినటువంటి శ్రీనివాస నాయుడు కూడా అక్కడ బాగా పేరు ఉందట బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉన్న నేత .. అలాగే గతంలో కూడా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో ఎన్నికలలో వ్యూహాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బీజేపీ మొదట్లో మద్దతు ఇచ్చింది కానీ ఇప్పుడు కూటమి పార్టీలు ఎక్కువగా రఘు వర్మ చేస్తున్నట్లుగా కనిపిస్తోందట. ఈసారి మహిళా అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వేగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఆమె ఎవరో కాదు యూటీఎఫ్ నుంచి బరిలోకి దిగినటువంటి విజయ గౌరీ.
యుటిఎఫ్ అంటే ఉద్యోగ సంస్థకు సంబంధించిన గుర్తింపుగా ఉన్నది. అంతేకాకుండా యూటీఎఫ్ లో చాలా యూనియన్ గా ఉంటారని వారి నుంచి ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లారకుండా ఉంటుందట.ఇది విజయ గౌరీకి ప్లస్ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఆమె మహిళా గా పోటీ చేయడంతో ఆమె ప్రత్యర్థులు అయినా రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు ఇద్దరిని ఉపాధ్యాయులు ఇప్పటికే చూసేయడం జరిగింది. వీరి పనితీరు కూడా పూర్తి అవగాహన రావడంతో ప్రస్తుతం విజయ గౌరీ పైన ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈమెకు న్యాయకత్వం వహించే లక్షణాలు చాలానే ఉన్నాయని ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయుల ఓట్లు సుమారుగా 22,493 వేలమంది ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువగా మహిళా టీచర్సే ఉన్నారట. ఒకవేళ అక్కడ వారంతా కూడా మహిళా ఎమ్మెల్సీనే తమకు కావాలి అంటే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ముగ్గురు సైడ్ చూసుకుంటే ముగ్గురు తరుపున కూడా మూడు బలమైన ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారు. మరి టీచర్ ఎవరు ఎవరికి పట్టం కడతారు అన్నది చూడాలి. విజయ గౌరీకి వైసిపి,రఘువర్మకు కూటమి ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.