ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన జైల్లలో తీహార్ జైలును ఒకటిగా జనాలు పరిగణిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం పెద్ద పెద్ద నేరాలు చేసిన వారిని ఆ జైల్లో బంధిస్తూ ఉంటారు. దానితో ఆ జైలు అంటేనే సామాన్య ప్రజలకు భయం పడుతూ ఉంటుంది. కానీ అలాంటి భయంకరమైన జైల్లో కూడా ఒకరికి అనేక సౌకర్యాలు కలిగినట్లు తాజాగా మాజీ తీహార్ PRO సునీల్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... సహారా చీఫ్ సుబ్రతా రాయ్ అనే వ్యక్తి ఇండియాలోనే చాలా మంది కి తెలిసే ఉంటాడు.

ఈయన సహారా అనే గ్రూపును స్టార్ట్ చేసి దాని ద్వారా వేల కోట్ల డబ్బులను పోగు చేసి ఆ తర్వాత వారికి ఆ డబ్బులను ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా సహారా లో డబ్బులు పోగు చేసిన ఎంతో మంది సామాన్య , మధ్య తరగతి వ్యక్తులు ఆ డబ్బులు వెనక్కి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే  సహారా చీప్ సుబ్రతా రాయ్ కొంత కాలం క్రితమే చనిపోయారు. ఇకపోతే తాజాగా ఈయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాజీ తీహార్ PRO సునీల్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చాడు. సుబ్రతా రాయ్ చనిపోయే ముందు తీహార్ జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్న సమయంలో ఏమి జరిగింది అనే దాని గురించి తీహార్ జైలు మాజీ PRO సునీల్ కుమార్ గుప్తా తాజాగా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా తీహార్ జైలు మాజీ PRO సునీల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ... దివంగత సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైల్లో ఉన్న ప్రదేశంలో విస్కీ బాటిళ్లు ఉన్నాయని ,  జరిగిన అన్ని సంఘటనల గురించి తాను కేజ్రీవాల్‌కు తెలియజేశానని ఆయన అన్నారు. తాను మొదట అప్పటి డీజీ (జైళ్లు) కి ఈ అక్రమ విషయాల గురించి కూడా ఫిర్యాదు చేశానని , కానీ తాను పట్టించుకోలేదని అన్నారు. తరువాత తాను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ వద్దకు కూడా వెళ్లి , జైలు పరిపాలనతో కుమ్మక్కై సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఫిర్యాదును కూడా అందించానని గుప్తా తాజాగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: