వైసిపి మద్దతుదారులు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన  సినీ నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు.  నిన్న అర్ధరాత్రి.. హైదరాబాదులోని గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై వైసీపీ నేత, టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల స్పందించారు. పోసాని కృష్ణ మురళి అరెస్టును తీవ్రంగా ఖండించారు యాంకర్ శ్యామల. సమయం లేదు సందర్భం అసలే లేదు అంటూ ఆమె ఆగ్రహించడం జరిగింది.

 రేపటి డేట్ తో ఇవ్వాల అరెస్టు చేసే సోయి అనేదే లేదు.. అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టుపై భగ్గుమన్నారు శ్యామల. ఆడ లేక మద్దలు అడ్డు అన్నట్లు హామీలు అమలు చేయడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్ష సాధింపులకు దిగుతున్నారని... పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం అత్యంత దారుణం అన్నారు. శివరాత్రి పూట krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేసి... ఆయనను అరెస్టు చేయడం... కూటమి ప్రభుత్వానికి చెల్లిందన్నారు.

 నిన్న పోసాని కృష్ణమురలి ని అరెస్టు చేసిన సందర్భంగా.. ఫిబ్రవరి 27వ తేదీతో.. అరెస్టు వారెంట్ ఇచ్చారు పోలీసులు. అయితే దీనిపై... యాంకర్ శ్యామల నిలదీయడం జరిగింది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో... సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై  పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 అప్పటి పరిస్థితిని బట్టి ఈ ముగ్గురు నేతలను బండ బూతులు తిట్టారు పోసాని కృష్ణమురళి. దానికి సంబంధించిన వీడియో ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. అయితే ఆ ముగ్గురు బడా లీడర్లను తిట్టిన నేపథ్యంలో... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పై ఏపీలో కేసు పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే వరుసగా వైసిపి నేతల అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: