పోసాని కృష్ణ మురళి అరెస్టుపై... వైసిపి పార్టీ తాజాగా స్పందించింది. వైసిపి నేత krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండించింది. కక్ష సాధింపు చేస్తావా చంద్రబాబు నాయుడు... అంటూ వైసీపీ పార్టీ మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో.... పోసాని కృష్ణ మురళికి సానుభూతిగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు అనే కారణంతో కక్ష సాధింపు.. చర్యలకు ఎందుకు పాల్పడుతోందని చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడింది వైసిపి.

 అన్యాయంగా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పై తప్పుడు కేసులు బనాయించారని... నిప్పులు జరిగింది వైసిపి పార్టీ.  పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగాలేదని... ఆయన సతీమణి చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని.. వైసిపి పార్టీ మండిపడింది. కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తూ... శివరాత్రి రోజున పోసాని కృష్ణమురలిని ఆయన ఇంటి నుంచి అరెస్టు చేశారని... రెచ్చిపోయింది వైసీపీ.

 ఇది నిజంగా కక్ష సాధింపు చర్య అంటూ రెచ్చిపోయింది. ఇలా ఇంకెంతకాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావు చంద్రబాబు నాయుడు? అంటూ నిలదీసింది వైసిపి. ఈ మేరకు సోషల్ మీడియాలో... పోసాని కృష్ణమురళికి అనుకూలంగా... చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... వైసిపి నేతగా కొనసాగిన పోసాని కృష్ణ మురళి.... కూటమినేతలపై దారుణంగా మాట్లాడారు.

 ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కుటుంబాన్ని కూడా... పోసాని కృష్ణ మురళి విమర్శించిన సంగతి తెలిసిందే. అలా గతంలో రెచ్చిపోయి మాట్లాడిన నేతలను అందరినీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం... అరెస్టు చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: