
పోయిన చోట వెతుక్కోవాలని ఓ పాత సామెత ఉంది .. ఇది రాజకీయ నాయకులకు చాలా చక్కగా వర్తిస్తుంది. వైసీపీ విషయానికొస్తే 2019 ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించింది. అదే 2024 ఎన్నికలో పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 2019లో అన్ని స్థానాలలో గెలిచింది. 2024 ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో అనకాపల్లి జిల్లాలో వైసిపి బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సీనియర్ నేత బలమైన సామాజిక వర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి అనకాపల్లి జిల్లా బాధ్యతలను వ్యూహాత్మకంగానే వైసిపి అధినేత జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్య లో ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవటానికి ధర్మశ్రీ కి ఈ పదవి కట్టబెట్టారు. తాజాగా తాడేపల్లిలో ధర్మ శ్రీ అధినేత జగన్ ను కలిశారు .. ఈ క్రమంలో నే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తో పాటు అనకాపల్లి ఎంపీ సీటును వచ్చి ఎన్నికలలో కచ్చితంగా గెలిపించాల్సిన అవసరాన్ని .. బాధ్య తను జగన్ ధర్మసరికి గుర్తు చేశారు.
ఇప్పటికి జిల్లా పరిధిలో పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్న వైసీపీ నేతలు జగన్ సూచనలతో మరింత దూకుడుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో వైసిపికి గట్టి పట్టు ఉంది .. చాలా జాగ్రత్తగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే జిల్లాలో తక్కువ టైంలోనే పార్టీ బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలు ఇటీవలే మాజీ మంత్రి కురసాల కన్నబాబు కు జగన్ అప్పటించిన విషయం తెలిసిందే. జగన్ ఉత్తరాంధ్ర విషయం లో బాగా ఫోకస్ పెట్టి మరీ పని చేస్తోన్న ట్టుగా కనిపిస్తోంది.