తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అక్కడి ప్రజలకు ఊరట కలిగించేలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వాహనదారులకు సైతం కొత్త రూల్స్ ని తీసుకురాబోతోంది.. అదేమిటంటే ప్రభుత్వ, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సైతం లొకేషన్ ట్రేసింగ్ డివైస్లను కచ్చితంగా అమలుపరిచేలా నిర్ణయాలను తీసుకున్నదట.. ఇక పైన తయారు చేసే వాహనాలతో పాటు ప్రస్తుతం నడుస్తున్న వాహనాలకు సంబంధించి జిపిఎస్ సిస్టం లొకేషన్ ట్రాకింగ్ కచ్చితంగా చేయించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తూ ఒక లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.


పబ్లిక్, ప్రైవేట్, ట్రాన్స్పోర్ట్ వాహనాలలో చాలా అక్రమ రవాణాలు జరుగుతున్నాయని అలాగే మహిళల పైన దాడులు ,రోడ్డు ప్రమాదాలు వంటివి అరికట్టేందుకే ఈ తరహా నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుంది.. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుమతిస్తే ఇండియాలో కూడా ఈత రహ నిబంధనలు తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రూల్ పాటించకుంటే మాత్రం ట్రాఫిక్ కేసులో పెట్టి మరి వాహనాలను కూడా సీజ్ చేయబోతున్నారట.


అలాగే ఖైరతాబాద్ లో కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రధాన కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కదలికపైన నిగా ఉంచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ ,గూడ్స్ వాహనాలకు సైతం  కచ్చితంగా ఈ రూల్స్ కఠినంగా అమలు చేయాలని రవాణా శాఖ కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుందట. ప్రస్తుతం కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గూడ్స్ వెహికల్స్ సైతం అన్నిట్లో కూడా విఎల్టీడిలను అమర్చబోతున్నట్లు తెలియజేశారు. మరి ఏ మేరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల అక్కడి ప్రజలకు సురక్షితంగా భద్రత కల్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: