
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు .. అయితే ఇది పోలింగ్ పై ప్రభావం చూపుతుందా లేదా అన్నదాన్ని పక్కన పెడితే .. రేవంత్‌ను వ్యూహాత్మకంగా బలహీనం చేయడానికి చేసిన ప్రయత్నం అని కూడా కొందరు చెబుతున్నారు .. అయితే రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ .. అందరూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ భేటీ అయినట్టుగా చూస్తారు .. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో సమావేశం కావటం పెద్ద విషయం లాంటిది కాదు .. అయితే తెలంగాణ విషయంలో మాత్రం పలు సందేహాలు బయటికి వస్తున్నాయి . ఇదే క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, కేంద్ర హోంమంత్రి అమీషాతో కలిసి ఓ కార్యక్రమంలో కనిపించారు ..
ఇక దాంతో ఆయన పైన కూడా గట్టి ప్రచారం మొదలయ్యింది.. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని బిజెపికి దగ్గర అవుతున్నాననేది తప్పుడు ప్రచారమని ఆయన బహిరంగంగా ఖండించారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ పై కూడా హై కమాండ్ అసంతృప్తిగా ఉందన్న ప్రచారం ఉంది .. ఇటీవల రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీతో సమావేశమైన ఫోటోలు బయటకు రాలేదు .. అలాగే హైకమండ్ కు ఆయనకు ఉన్న గ్యాప్ ను బిజెపి మరింత ఊహాత్మకంగా పెంచుతుంది .. అలాగే ప్రధాని అపార్ట్మెంట్ ఇచ్చాక నో అని చెప్పలేరు కదా .. ఇక అయితే ఈ రాజకీయ అన్న స్థితిని సీఎం రేవంత్ ఎలా ఎదుర్కొంటారో?