
ఆసుపత్రికి వెళ్లాలని కూడా చెప్పినట్లు.. వెల్లడించారు పోసాని భార్య కంసుమలత. నోటీసు ఇవ్వండి రేపు వస్తామని కూడా చెప్పినట్లు వివరించారు. తన భర్త ఫోను అలాగే నా ఫోన్ కూడా పోలీసులు తీసుకువెళ్లారని... ఫోన్లు కూడా చేసుకొని ఇవ్వలేదని... ఏపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు పోసాని భార్య కం సుమలత. రాత్రి పూట తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు. బాత్రూం అలాగే బెడ్ రూమ్ లోకి వెళ్లి కూడా పోలీసులు... నాన రచ్చ చేశారని.. పోసాని భార్య కం సుమలత ఫైర్ అయ్యారు.
రాజకీయాలలో లేనని ఇకపై ఎవరిపై మాట్లాడ బోనని ఇటీవల పోసాని కృష్ణమురళి... ప్రకటించినట్లు గుర్తు చేశారు. పోలీసులు హడావుడిగా బలవంతంగా తన భర్తను ఎత్తుకెళ్లారని... ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తన భర్త అరెస్టు పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిందని కూడా.. ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని భార్య కంసుమలత.
ఇది ఇలా ఉండగా... పోసాని కృష్ణ మురళి అరెస్టు నేపథ్యంలో రంగంలోకి జగన్ మోహన్ రెడ్డి కూడా దిగారు. పోసాని కృష్ణ మురళి భార్య కంసుములతో ఫోన్ కూడా మాట్లాడారు. ఆమెకు భరోసా కల్పించారు పోసాని కృష్ణ మురళి. బాధపడకూడదని... అందరికీ అండగా ఉంటానని... జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు పోసాని కృష్ణమురళిని బయటికి తీసుకువచ్చేందుకు వైసిపి లాయర్లు కూడా రంగంలోకి దిగారు. అటు వల్లభనేని వంశీ ఎపిసోడ్ పూర్తికాకముందే ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేయడంతో వైసిపి డీలపడింది.