ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు కానీ, ఒక్కోసారి వయసు మరీ ఎక్కువైతే ప్రేమ కూడా ప్రమాదకరంగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఉదంతమే విదేశాంగ శాఖలో పనిచేసిన మాధురి గుప్తా జీవితంలో జరిగింది. 52 ఏళ్ల వయసులో ఆమె ప్రేమలో పడటం మాత్రమే కాదు, దేశద్రోహం కేసులో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఆమె పేరు మాధురి గుప్తా. పేరుకు తగ్గట్టే తీయటి మాటలు, అందమైన రూపం. విదేశాంగ శాఖలో టాప్ పొజిషన్‌లో పనిచేసింది. ఉర్దూ భాషపై పట్టు ఉండటంతో ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియా వంటి దేశాల్లో చక్రం తిప్పింది. పాకిస్థాన్‌లో కూడా పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

పాకిస్థాన్‌లో పనిచేస్తున్న సమయంలో జంషేద్ అలియా జిమ్మీ అనే ఒక వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మాధురి 52 ఏళ్ల వయసులో ఉన్నా, జిమ్మీ మాయలో పడిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే.. జిమ్మీ ఒక పాకిస్తాన్ గూఢచారి.

పాకిస్థాన్‌ గూఢచారులు మాధురిని తమ వలలో వేసుకున్నారు. జిమ్మీ ద్వారా ఆమెను లొంగదీసుకున్నారు. ప్రేమ పేరుతో బురిడీ కొట్టించారు. మాధురి గుప్తా గుడ్డిగా అతన్ని నమ్మింది. అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడింది. చివరికి మతం కూడా మార్చుకుంది. పెళ్లి కూడా చేసుకుంది.

ఇక అప్పటినుంచి అసలు కథ మొదలైంది. దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేయడం మొదలుపెట్టింది మాధురి. అయితే నిఘా వర్గాలు ఊరుకుంటాయా? మాధురి గుప్తా వ్యవహారంపై అనుమానం రావడంతో నిఘా పెట్టారు. ఆమె పంపుతున్న సమాచారం నిజమైనదా లేదా అని టెస్ట్ చేశారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఆమెను ట్రాప్ చేశారు. చివరికి ఢిల్లీకి పిలిపించి అరెస్ట్ చేశారు. ఆధారాలు చూపించేసరికి మాధురి నేరం ఒప్పుకుంది.

కోర్టు ఆమెకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలులో ఉండగానే కరోనా సోకి చనిపోయింది. ఆమె మృతదేహాన్ని భర్తకు అప్పగిస్తామంటే వద్దన్నాడట. అంటే ప్రేమ పేరుతో వాడుకున్నాడే కానీ, నిజంగా ప్రేమించలేదని అర్థమవుతోంది.

నిజమైన ప్రేమంటే మతం మారమని చెప్పడం కాదు. నీ మతంలో నువ్వు ఉంటూ, నా మతంలో నేను ఉంటూ కలిసి జీవించడమే నిజమైన ప్రేమ. కానీ మతం మార్చి పెళ్లి చేసుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? ఇది డాలర్ల ప్రశ్న కాదు.. దేశ భద్రతకు సంబంధించిన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: