
అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను కూడా రూపొందించారు .. ఈసారి బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం ఉంది ..అలాగే ఐదు వేల కోట్లతో వ్యవసాయం బడ్జెట్ కూడా ఉంటుందని చెబుతున్నారు .. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం . అలాగే ఈ బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు అమరావతికి నిధులు కేటాయింపు కూడా కీలకంగా మారనుంది. ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు ప్రతి తల్లికి ఏడాదికి 15000 ఇవ్వాల్సి ఉంది ఈ పథకం అమలు కోసం తాజాగా లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు . అలాగే ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాలో ఏడాదికి 15000 చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వ ఇవ్వాల్సి ఉంది .
ఇక ఇందుకు సుమారు 10,300 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది .. ఇక వచ్చే మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు . అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన కూడా కీలక ప్రకటన చేశారు .. ఈ పథకం కూడా ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20000 ఇవ్వాల్సి ఉంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో ఆరవత ఉన్న రైతులు సంఖ్య 53. 58 లక్షలగా అధికారులు గుర్తించారు .. ఇలా ఒక్కో రైతుకు 20,000 చొప్పున ఇచ్చేందుకు కావలసిన మొత్తం 10.717 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క వేసింది .. అలాగే పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6000 మినహా ఇచ్చటం ద్వారా ఒక్కో రైతుకు సంవత్సరానికి 14000 చొప్పున చెల్లించనున్నారు .. ఇక ఇందుకోసం కావాల్సింది మొత్తం 7,502 కోట్లు గా గుర్తించారు .. ఇలా ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది . అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా ఈ కేటాయింపులు చేయబోతుంది.