వైసిపి పార్టీ నేత, మాజీ మంత్రి రోజా మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే సినిమాలు చేయకుండా బుల్లితెర పైన రోజా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఛానల్ లో ప్రారంభం కాబోయే రియాలిటీ షోలో... మాజీ మంత్రి రోజా సందడి చేయడం జరిగింది. ఈ కామెడీ షోలో నటుడు శ్రీకాంత్ అలాగే నటి రాశి.. కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రోజా కూడా కనిపించారు. ఎందుకు సంబంధించిన ప్రోమోను... సదరు ఛానల్ విడుదల చేయడం జరిగింది.


దీంతో మాజీ మంత్రి రోజా... బుల్లితెర పైన మళ్లీ కనిపించబోతున్నట్లు... వార్తలు వస్తున్నాయి.   గతంలో జబర్దస్త్ షోలో... జడ్జిగా రోజా  వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పుడు.... రోజా కారణంగా జబర్దస్త్ మంచి పాపులారిటీ కూడా దక్కింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చాడో... అప్పటినుంచి ఆమె జబర్దస్త్కు దూరమయ్యారు. ముఖ్యంగా మంత్రి పదవి రాగానే... జబర్దస్త్ గుడ్ బై చెప్పి ఫుల్ టైం పొలిటిషన్ గా మారిపోయారు రోజా.

తర్వాత జబర్దస్త్ షో కూడా పెద్దగా పాపులారిటి దక్కించుకోలేదు.  అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ఓడిపోవడం జరిగింది. దీంతో ఆమె ఖాళీగానే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై.. విమర్శలు చేస్తూ.. యాక్టీవ్ అయ్యారు. ఇక ఇదే సందుగా... బుల్లితెరలో కూడా కనిపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు రోజా.

 బుల్లితెరలో కనిపిస్తే రోజాకు మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని... అందరూ అంటున్నారు. ఇది ఇలా ఉండగా... జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా రెండు సంవత్సరాలపాటు పనిచేశారు మాజీ మంత్రి రోజా. ఆ తర్వాత.. నగరి ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవి చూశారు. టిడిపి పార్టీ అభ్యర్థి చేతిలో నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు రోజా. ఆమె ఓటమికి వైసిపి నేతలు కూడా కొంతమంది కారణమంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: