
అలాగే తెలంగాణ విషయానికి వస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలలో సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు పోలింగ్ అయిన పర్సంటేజ్ విషయానికి వస్తే.. ఉమ్మడి కరీంనగర్ తో పాటుగా మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ వంటి ప్రాంతాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సైతం 40.61 % వరకు జరిగిందట ఇక ఇవే జిల్లాలలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సైతం 63.49 % పోలింగ్ నమోదైనట్లు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి ప్రాంతాలలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35 % వరకు పోలింగ్ నమోదయిందట.ఇక ఈ ఫలితాల సైతం వచ్చే నెల మూడవ తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతున్నారు.
అయితే అన్ని చోట్ల కూడా సజావుగానే ఎన్నికలు జరిగినట్లుగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలుస్తారు అన్నది వచ్చే నెల మూడవ తేదీన తెలియబోతోంది. అయితే ఈ ఎన్నికలను కూడా చాలా మంది నేతలు ఒక ప్రెస్టేజ్ గానే తీసుకొని మరి చాలా ప్రత్యేకమైన దృష్టిలో పెట్టి మరి గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏపీలో అయితే మరింత ఉత్కంఠంగా ఎన్నికల ఫలితాలు కనపరిచేలా ఉన్నాయి.