- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ 100% ప్రభుత్వ సంస్థగా, పరిశ్రమలు & వాణిజ్య శాఖ పరిధిలో, అక్టోబర్ 2015లో కంపెనీస్ యాక్ట్, 2013 ప్రకారం స్థాపించబడింది. ఈ సంస్థ 2015లో 8 మందితో ప్రారంభం అయ్యింది. 2019 అంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 111 మంది ఉద్యోగులు ఉన్నారు.
2024లో జగన్ ముఖ్య‌మంత్రిగా దిగిపోయే సమయానికి 1350 మంది ఉద్యోగులు ఉన్నారు. 2019-2024 మధ్య ఎక్కువ మంది అనర్హులుని చేర్చి, కేవలం జీతాల కోసమే వారిని నాటి వైసీపీ ప్రభుత్వం నియమించిందన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2024 సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత  ఫైబర్ నెట్ కార్యాలయం సీజ్ చేసారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని రికార్డులు స్కాన్ చేసి భద్ర పరిచి,  2024 సెప్టెంబర్‌లో కార్యాలయం తిరిగి ప్రారంభించారు. అప్పటికే జరిగిన ప్రాధమిక విచారణలో, 417 మంది ఉద్యోగులని అనర్హులుగా లేదా సంస్థలో అనుమతు ల్లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించి వారిని తొలగించారు.


2024 ఏప్రిల్ లో 1342 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2024 డిసెంబర్ జీతాలు ఇచ్చే నాటికి 925కి చేరుకుంది. అంటే డిసెంబర్ కంటే ముందే 417 మంది అనర్హులని తొలగించారు. మిగిలిన ఉద్యోగుల స్థితిగతులు తెలుసుకోవటానికి ఒక కమిటీ నియమించారు. జీవీ రెడ్డి నవంబర్ 15న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసారు  డిసెంబర్ 19న మొదటి సారి రివ్యూ చేసి, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టారు... డిసెంబర్ 24న మరో ప్రెస్ మీట్ పెట్టి 410 మంది ఉద్యోగులను తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 21.01.2025న కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. 2024 డిసెంబర్ నాటికి ఉన్న  925 మందిలో 200 మంది అనర్హులుగా లేదా సంస్థలో అనుమతు ల్లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 2024 నుంచి నవంబర్ 2024 వరకు, ఈ మూడు నెలల్లో 417 మంది ఫైబర్ నెట్ ఉద్యోగులని అనర్హులుగా గుర్తించి తొలగించారు.


ఉద్యోగం నుంచి తొల‌గించిన వారు అంద‌రూ ఒకేసారి కోర్టుకు వెళితే ఈ ప్ర‌క్రియ మ‌రింత క‌ష్టం అవుతుంది. అందుకే కేసు కొన‌సాగి రోజులు వీళ్ల‌కు ప్ర‌భుత్వ జీత‌భ‌త్యాలు ఇవ్వాల్సి వ‌స్తుంది. అందుకే సున్నితంగా విడి విడిగా ఒక్కొక్క కేసును పరిష్కరిస్తూ రావడంలో కొంత సమయం పడుతుంది. ఈలోపే కొన్ని అవాంఛిత ఘటనలు జరిగిపోయాయి. ఒక కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్స్ ఉద్యోగిని తొలగించినప్పుడు చట్టానికి లోబడి వారికి రెండు లేదా మూడు నెలల జీతం ఇవ్వవలసి ఉంటుంది. ఇవ‌న్నీ జ‌రుగుతున్న క్ర‌మంలోనే జీవి రెడ్డి ప్రెస్‌మీట్‌.. దినేష్ కుమార్ సైన్ చేయ‌క‌పోవ‌డం.. చంద్ర‌బాబు మంద‌లింపు.. జీవి రెడ్డి ప‌ద‌వితో పాటు పార్టీకి రాజీనామా.. దినేష్‌కుమార్‌ను జ‌డీఏకు బ‌దిలీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: