
ఆంధ్రప్రదేశ్ 2025 - 2026 బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశ పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ గా దీనిని ప్రవేశ పెడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి స్థాయి లో ప్రవేశ పెడుతోన్న తొలి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఇక 3.25 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. వ్యవసాయ బడ్జెట్ రూ.50వేల కోట్లు దాటే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీలకు సబ్ ప్లాన్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అమరావతి , పోలవరానికి భారీ కేటాయింపులు చేస్తారని అంచనాలు ఉన్నాయి. సూపర్ సిక్స్.. కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ కు కూడా నిధులు ఉంటాయని అంచనా. విద్య, వైద్యం, గృహ నిర్మాణమే భారీ లక్ష్యాలుగా పెట్టు కోనున్నారు. శుక్రవారం శాసనసభ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ను సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక కీలక మైన వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ప్రవేశ పెడతారు.
ఇక బడ్జెట్ లో కీలకమైన రాజధాని అమరావతి తో పాటు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన ప్రతిష్టాత్మ క పోలవరం ప్రాజెక్టు కు నిధులు కేటాయించే విషయం లోనూ నిధుల కేటాయింపు ఎలా ఉంటుంది .. ఏం చేస్తారు ? అన్న ఆసక్తి సహంగానే అందరి లోనూ ఉంది. మరి ప్రభుత్వం ఎన్నికల కు ముందు ఎంతో ప్రతిష్టాతకం గా హామీలు సూపర్ సిక్స్ పేరిట ఇచ్చింది. వీటికి ఈ సారి నిధుల కేటాయింపు ఎలా ఉంటుందో ? కూడా చూడాలి. బడ్జెట్ పై సామాన్యుడి ఆశలు మామూలుగా లేవు.