ఉమ్మ‌డి గోదావ‌రి రెండు జిల్లాల్లోని ఆరు జిల్లాల పరిధిలో 456 పోలింగ్ కేంద్రాల్లో 69.50 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఆరు జిల్లాలో పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 456 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందన్నారు.  ఏలూరు కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందన్నారు.  కంట్రోల్ రూం నుంచి ప్రతి రెండు గంటలకు ఓటింగ్ శాతం విడుదల చేయడం జరిగిందన్నారు.  


పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు సర్. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భధపర్చడం జరుగుతుందన్నారు. ఆయా జిల్లాల నుంచి పోలింగ్ సిబ్బంది తీసుకువచ్చే పోలింగ్ సామాగ్రిని తీసుకునేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.


జిల్లాల వారీగా నమోదైన ఓటింగ్ వివరాలు -
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాల్లో 4, 669 మంది ఓటర్లకు గాను 3,637 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 77.90 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.  
- డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాల్లో 64,471 మంది ఓటర్లకు గాను 47,125 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 73.09 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.
- తూర్పు గోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాల్లో 62,970 మంది ఓటర్లకు గాను 42,446 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 67.41 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.  
 

- ఏలూరు జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లకు గాను 29,651 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 70.13 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.  
- కాకినాడ జిల్లాలో 98 పోలింగ్ కేంద్రాల్లో 70,540 మంది ఓటర్లకు గాను 47,150 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 66.84 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాల్లో 70,052 మంది ఓటర్లకు గాను 48,893 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 69.80 శాతం పోలింగ్ నమోదైయిందన్నారు.


మొత్తం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. మొత్తం 69.50 శాతం పోలింగ్ నమోదైయినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

MLC