జనసేన పార్టీకి సంబంధించి నాయకుల విషయంలో ఈసారి మామూలుగా ఉండే అవకాశం లేదంటున్నారు పార్టీ నేతలు.. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పెద్ద ఎత్తున చాలామంది నేతలను పార్టీల నుంచి జనసేనలోకి చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రఘురాగవను కూడా పార్టీలోకి చేర్చుకొనబోతున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. ఒంగోలులో ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ టిడిపి నేత 2014 నుంచి 2019 వరకు రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.



2019 ఎన్నికలలో ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసిపి పార్టీలోకి చేరిన ఈయన 2024 లో దర్శి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అందుకోలేకపోయారు. దీంతో కొన్ని కారణాల చేత వైసిపి ఓటమి తర్వాత సిద్ధ రఘురాగవ మళ్ళీ కూటమి వైపు గానే మళ్ళినట్లు ప్రచారం కూడా జరిగింది. విజయవాడలో గత ఏడాది జరిగిన వరదల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి భారీ విరాళాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మాజీ మంత్రి. దీంతో ఈయన టిడిపి పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి.


కానీ ఎందుకో అలా మాత్రం జరగలేదు.. సిద్ధ రాఘవుని జనసేన పార్టీలోకి తీసుకునేలా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒంగోలు కార్పొరేషన్ లో జనసేన పార్టీ కైవసం చేసుకున్నారు.ఇప్పుడు సిద్ధ రఘు రాఘవ వంటి వారిని కూడా జనసేన పార్టీలోకి చేర్పించుకోవడంతో తన బలాన్ని సైతం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట మాజీ మంత్రి బాలినేని. దీంతో ఆయనతో పాటుగా మరికొంతమంది జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ బంధువుగా ఉన్న బాలినేని జనసేనలోకి చేరడంతో ఆయన తన బలాన్ని చూపించడానికి ఇలా చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: